Script 1
[ఈ రికార్డింగు ఒక ఐవిఆర్ లో ఉపయోగించబడుతుంది. దీన్ని మేము చాలా క్రియాత్మకంగా కావాలనుకుంటున్నాము]
హలో! మా కంపెనీకి కాల్ చేసినందుకు ధన్యవాదాలు! ప్రతి భాషలోనూ కచ్చితమైన వాయిస్ఓవర్ (స్వరానుకరణ) పొందడానికి అత్యుత్తమమైన మార్గము!
కంపెనీ గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే ఒకటి నొక్కండి.
మీరు ఒక ప్రాజెక్టును సమర్పించాలనుకుంటే లేదా మా సేల్స్ టీముతో మాట్లాడాలనుకుంటే రెండు నొక్కండి.
సహాయకారి అయిన మా ప్రొడక్షన్ మేనేజ్మెంట్ టీము సహాయం కావాలా?
ఏమీ పరవాలేదు! దయచేసి మూడు నొక్కండి.
నాణ్యతకు సంబంధించిన విచారణకు నాలుగు నొక్కండి.
ఏదైనా ఉపాయం తట్టిందా? సలహాలా? వాటిని వింటానికి ఎంతో ఇష్టపడతాం! ఐదు నొక్కండి.
[మీరు తటపటాయిస్తూ ఉంటే గనక, దయచేసి ఇది చదవండి] ప్చ్! మా టీములో భాగం కావాలనుకుంటున్నారా?
[మునుపటి స్వరానికి వెనక్కి వెళ్ళండి] మేము నియమించుకుంటున్నాం!
మా ప్రస్తుత జాబ్ ఆఫరింగ్స్ గురించి మరింతగా తెలుసుకోవడానికై, దయచేసి మా వెబ్సైట్ సందర్శించండి!
Script 2
[ఈ రికార్డింగు మా మార్కెటింగ్ క్యాంపెయిన్ వీడియోలో ఉపయోగించబడుతుంది. దీన్ని ధ్వనిసహితంగా, ఆసక్తికరంగా, ఇంకా కొంతవరకు ఆశ్చర్యదాయకంగా ఉంచాలనుకుంటున్నాము.]
కంఠస్వరాలు పొందడం కష్టమవుతోన్న ప్రపంచములో. స్వరముతో కూడిన నటనలో ఒక కెరీర్ ను పొందడం గజిబిజిగా మరియు ఖర్చుతో కూడుకున్న ఈ ప్రపంచములో, ఒక విప్లవాన్ని తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాం!
ఈ ప్రయాణం అంత సులువైందేమీ కాదు, ఐతే మేము ఎప్పుడూ లేనంత ధృఢంగా ఉన్నాము.
వాయిస్ ఓవర్ పరిశ్రమను మీ ఇంటికి తీసుకు రావడానికి అంచెలంచెలుగా మేము ఒక డిజిటల్ సర్వీసును సృష్టించాం. ఈ మహత్కార్యంలో మిమ్మల్ని కూడా చేఱ్చుకున్నాం, ఈ స్వప్నం సాకారం కావడంలో మీరు కూడా భాగం పంచుకుంటారని భావిస్తున్నాం.
వెనక్కి తిరిగి చూడాల్సిందేమీ లేదు.
మేము వచ్చాం, ప్రపంచాన్ని మేం మార్చాం, ఇంకా మేం ఇక్కడ నిలవడానికే ఉన్నాం. [ఇక్కడ స్వల్ప విరామం ఇవ్వండి].
మేము వాయిస్ ఓవర్ పరిశ్రమను మీ చేతుల్లోనికి తీసుకువస్తున్నాం.
Script 3
[ఈ రికార్డింగు మా ప్రోడక్టు వీడియోలో ఉపయోగించబడుతుంది. దీన్ని మేము శక్తిదాయకంగా, ఆసక్తికరంగా, ఇంకా అనర్గళంగా కావాలనుకుంటున్నాము.]
నైపుణ్యంతో కూడిన వాయిస్ ఓవర్స్ కు మేము ఎందుకంత అత్యుత్తమంగా ఉన్నాం?
మొదలుపెట్టాలంటే, మా నాణ్యతా నియంత్రణ బృందముచే పరిశీలించబడ్డ అత్యుత్తమ స్థాయి వాయిస్ ఓవర్లను మాత్రమే మేము అందజేస్తాం. దానితో పాటుగా, మా వాయిస్ ఓవర్ కళాకారుల సమూహములో మీ ఎంపిక ప్రకారం, కావాల్సిన అనేక భాషల్లో, శైలుల్లో మరియు సరిపోయే ధరల్లో వేలాదిమంది సిద్ధంగా ఉన్నారు! అన్నింటికీ మించి, మా ప్రాజెక్టులన్నీ సంతృప్తి హామీనిస్తాయి. ఫలితంతో మీరు గనక సంతోషపడకపోతే, మా ప్రొడక్షన్ మేనేజ్మెంట్ టీము కలుగజేసుకొని, మీ డబ్బును మీకు తిరిగి ఇచ్చేస్తుంది. [ప్రతి పదానికీ మధ్య కొంత విరామాన్నివ్వండి] ప్రశ్నలేవీ అడగవద్దు.
మేము కస్టమరుకు అమితంగా మద్దతునిస్తాం; మీకు సహాయపడ్డానికి మా టీము ఎంతో సంతోషిస్తుంది. మాతో మీ అనుభవం మీకు సాటిలేనిది, వృత్తి నైపుణ్యముతో కూడినదిగా మరియు వినోదంగా అనిపించేలా మేము చూసుకుంటాం [ ఇక్కడ స్వల్ప విరామం]!